సాయి సచ్చరిత్ర పారాయణం

సాయి సచ్చరిత్ర పారాయణం
2 - 2 - 12 --- సద్గురుని పాదారవిందములను జ్ఞప్తి యందు ఉంచు కొన్నచొ  మన కష్టములు నశించును. ---- హేమాద్ పంత్  శ్రీ . సా. స 42 అధ్యాయము
                                       

3 - 2 - 12 --- నాది నగదు బేరమే కాని అరువు బేరము కాదు.  --- బాబా   శ్రీ . సా. స 16 అధ్యాయము
                                                   
4 - 2  - 12 --- గురువనుగ్రహము లేని పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము  --- బాబా  శ్రీ . సా. స 40  అధ్యాయము
                                                   

5 - 2 - 12 --- నాకొక గురువుండెను..... కానీ నా చెవిలో వారు ఏ మంత్రమూ ఊదలేదు. --- బాబా  శ్రీ . సా. స 19  అధ్యాయము
                                                   

6 - 2 - 12 --- బ్రహ్మమును చూచుటకు 5  వస్తువులను సమర్పించవలెను. --- బాబా  శ్రీ . సా. స 17  అధ్యాయము
                                                   

7 - 2 - 12 --- మీ రూపమును ధ్యానించుచూ రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా? కాదా? అనునది మాకు తెలియదు. --- దీక్షిత్  శ్రీ . సా. స 23 అధ్యాయము
                                                   

8 - 2 - 12 --- నీ వెక్కడున్నావో నీ భక్తులకు  తెలియదు. కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడు చున్నావని తుట్టతుదకు గ్రహించెదరు.   --- హేమాద్ పంత్  శ్రీ . సా. స 46 అధ్యాయము
                                      

9 - 2 - 12 --- నా చేయి కాలితే కాలినది. అది నా కంత బాధకారము కాదు. కానీ, బిడ్డ రక్షింప బడేనను విషయము నాకనందము కలుగు చేయు చున్నది. --- బాబా  శ్రీ . సా. స 46 అధ్యాయము 
10 - 2 - 12  --- మానవుడిచ్చునది త్వరలో సమసి పోవచ్చును.  కానీ దైవమిచ్చునది శాశ్వతము గా నిలుచును. --- బాబా  శ్రీ . సా. స ౩౨ అధ్యాయము 
11 - 2 - 12 --- విటల్ పాటిలుడు వచ్చినాడా? ఏ మాత్రము అజాగ్రత్తగా వున్నను, తప్పించుకొని పారిపోవును. --- బాబా  శ్రీ . సా. స 4 అధ్యాయము
12 - 2  - 12 --- నా గురువు నా  నుండి 2 పైసలు దక్షిణ  అడిగెను. నేను దానిని వెంటనే వారికీ సమర్పించితిని. --- బాబా  శ్రీ . సా. స 19  అధ్యాయము 
13 - 2 - 12 --- బ్రహ్మ జ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్ కారమునకు పోవు దారి చాల కటినమైనది. --- బాబా  శ్రీ . సా. స 17  అధ్యాయము
14 -  2 - 12 --- ఇంద్రియములు చలించవచ్చును. శరీరమును స్వాధీనము  నందు ఉంచుకొనవలెను. --- నానా   శ్రీ . సా. స 49   అధ్యాయము
15 - 2 - 12 --- ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో, వారెన్నడూ, ఏ వ్యాధి  చేతను బాధపడరు --- బాబా  శ్రీ . సా. స 34 అధ్యాయము 
16 - 2 - 12 --- ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్తుడను. --- బాబా  శ్రీ . సా. స 44 అధ్యాయము 
17 - 2 - 12 --- ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తి యందు వుంచుకొనుడు. నా యందె మనఃపూర్వకముగను  , హృదయపూర్వకముగను, నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. --- బాబా  శ్రీ . సా. స 44 అధ్యాయము 
18 - 2 - 12 --- ఫకీరు ఎవరిని చూపునో వారి వద్దనే ధనము పుచ్చుకొందును. ఎవరైనా ఫకీరుకు గత జన్మనుంచి బాకీ ఉన్నచో వాణి వద్దనే ధనము పుచ్చుకొందును. --- బాబా  శ్రీ . సా. స 53  అధ్యాయము
19 - 2  - 12   --- నా గురువు కోరిన రెండు కాసులలో  1 . నిష్ఠ 2 . సంతోష స్థైర్యముతో కూడిన ఓరిమి. నేను ఈ రెంటిని వారికి అర్పించితిని. వారు ప్రసన్నులైరి --- బాబా  శ్రీ . సా. స 19  అధ్యాయము
20 - 2 - 12  --- ఆత్మ సాక్షాత్కారము నాకు పోవు దారి కత్తి వాదర వలె  మిక్కిలి పదునైనది.  --- బాబా  శ్రీ . సా. స 17  అధ్యాయము 
21 - 2 - 12 ---  నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చ  వలయును --- బాబా  శ్రీ . సా. స 2 అధ్యాయము 
22 - 2 - 12 --- ఈ పాదములు ముదుసలివి. పవిత్రమైనవి. ఇక నీ కష్ట ములు  తీరిపోయినవి. --- బాబా  శ్రీ . సా. స 48 అధ్యాయము
23 - 2 - 12 --- అజ్ఞాని లక్షణములు 1 . నేను జీవిని 2 . నేను శరీరమును 3 . భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు. --- బాబా  శ్రీ . సా. స 39  అధ్యాయము 
24 - 2 - 12 --- ఈయన ఒక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియును. --- ఆనందనాధుడు   శ్రీ . సా. స 5  అధ్యాయము
25 - 2 - 12 --- భక్తునిలో అహంకారము విజ్రుంభించగనే బాబా దానిని అణచివేయును. --- హేమాద్ పంత్  శ్రీ . సా. స 6 అధ్యాయము
26 - 2 - 12 --- నాకొక గురువుండెను. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు కానీ, వస్త్రమునకు కానీ, నాకు లోటు లేకుండెను. --- బాబా  శ్రీ . సా. స 1అధ్యాయము
27 - 2 - 12 ---  అందరునూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. --- బాబా  శ్రీ . సా. స 17 అధ్యాయము
28 - 2 - 12 ---  శ్రీ రాముడును, రహీమును ఒక్కడే. వారిరువురి మధ్య ఏమీ బేధము లేదు. అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందుకు? --- బాబా  శ్రీ . సా. స 10 అధ్యాయము
29 - 2 - 12 --- నా  మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములైన విడిచెదను. --- బాబా  శ్రీ . సా. స 40 అధ్యాయము

మార్చి నెల పారాయణం కోసం చూడండి. 
http://www.sathyaanveshana.blogspot.in






                                                    
  

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...