మీ ఆరోగ్యం, మీ ఇష్టం

మీ ఆరోగ్యం, మీ ఇష్టం 
          మనుషులు  ఒకప్పుడు  అంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, ఎన్ని రకాలుగా ఆహార పదార్థాలు తీసుకునేవరో ఆలోచించండి. 
100 % మంచి ఫుడ్.
          1. కృతయుగంలో కేవలం పళ్ళు, కాయలు, నానబెట్టిన గింజలు తీసుకునేవారు. ఆకులు, అలములు , తేనె ఇలాంటి ఆహారాన్ని తీసుకునేవారు. అప్పుడు వ్యవసాయం లేదు. కేవలం ప్రకృతి  ద్వారా ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు రకరకాలుగా (పక్షుల మూలం గా, గాలి మూలం గా ఇంకా ఎన్నో రకాలుగా ) వెదజల్లబడి , వాటి  ద్వారా వచ్చిన ఆహారాన్ని తీసుకునేవారు. అప్పుడు వ్యాధులు కూడా ఉండేవి కావు. ఇది 100 % మంచిది. వ్యక్తి పరంగా ఆహారాన్ని సంపాయించే పద్ధతి. ఆ కాలం లో వివాహ  బంధాలు లేకుండా బ్రతికే వారు. ఇది ప్రకృతి ప్రసాదించిన రెడీమేడ్  ఫుడ్. 
80 % మంచిది. 20 % చెడ్డది
          2 . త్రేతాయుగంలో పై వాటినే ఉడికించి తినేవారు. ఎందుకంటె, ఒక తెలివైన సైంటిస్టు కావచ్చు, లేదా భక్తురాలు కావచ్చును కనిపెట్టిన పద్ధతి ద్వారా వ్యవసాయమును ప్రారంభించినారు ప్రజలు కనుక. ఆ భక్తురాలే శబరి. ఈ యుగంలో సైంటిస్టులను ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, సన్మానించి నట్లు, ఆ శబరిని మహారాజైన శ్రీ రామచంద్రుడు అక్కున చేర్చుకున్నాడు. ( ప్రకృతి ద్వారా కాకుండా) మానవుని ప్రమేయంతో వ్యవసాయం ద్వారా తయారైన ఆహార పదార్థాలను నీళ్ళలో ఉడికించి తినాలి.
తప్పదు. ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన ఆహారానికి, మానవుని తెలివి తేటలతో చేసిన వ్యవసాయ ఆహారానికి స్వల్ప తేడా వుంటుంది కనుక. ఆ స్వల్ప తేడా వలెనే వ్యాధులు మొదలైనాయి. అప్పుడు పుట్టింది ఆయుర్వేదము. ఎందుకంటె, కృత యుగములో అన్ని రకాలు (తీపి, కారము, పులుపు, చేదు, వగరు, ఉప్పు) తినే వారు.వ్యవసాయం ప్రారంభించాక ఉప్పు, కారము, తగ్గించారు. వాటికోసం కృత యుగములో తీసుకునే కొన్ని ఆకుల్ని, కాయల్ని, త్రేతా యుగములో వైద్యపరంగా తీసుకోవడం ప్రారంభించారు. దాని వలన ఆయుష్యు పెరుగుతుందని, ఆయుర్వేదము అని పరిశోధకులు అన్నారు. ఇది 80 % మంచిది. 20 % చెడ్డది. ఇది ఎవరి ఇళ్ళలో వారు చేసుకునే పద్ధతి. ఇది చిన్న కుటుంబాలు (న్యూక్లియర్  ఫ్యామిలీస్) తీసుకునే పద్ధతి.
          త్రేతా యుగములో వ్యవసాయాన్ని డెవలప్ చేస్తూ భరతుడు భారత దేశం నుండి రోమ్ నగరం వరకు వెళ్లి అక్కడ ఒక బ్రాంచి రామ్ నగరము  అని పెట్టాడు. భారత దేశం టు రామ్ నగరము రహదారి వేసి ఆ రహదారికి అటువైపు, యిటువైపు పండ్ల మొక్కలు నాటడమే కాకుండా రెండు వైపులా వ్యవసాయ భూములను సిద్ధం చేస్తూ, పంటలు పండిస్తూ పెద్ద రైతుగా మారదు  భరతుడు. అప్పుడు ప్రజలందరూ అందులో వర్కర్లే. (త్రేతాయుగం లో వర్కర్ల సంక్షేమ వివరాలు  అనే బుల్లెటిన్  లో  చూడండి.) అప్పుడు వ్యవసాయానికి ఉపయోగ పడేలా పశువులను, గుర్రాలను, గొర్రెలను, గాడిదలను , ఒంటెలను, ఉపయోగించేవారు.
60 % మంచిది. 40 % చెడ్డది.
          ౩. ఇక ద్వాపర యుగంలో పశువులను, గుర్రాలను, గొర్రెలను, గాడిదలను , ఒంటెలను, ఉపయోగించేటప్పుడు కొందరు మేధావులు వాటి పాలను కూడా ఆహారంగా  తీసుకోవడం జరిగింది. అయితే, త్రేతా యుగంలో ఉప్పు కరం తగ్గించినందు వలన వ్యాధులు వస్తున్నాయని, ద్వాపర  యుగంలో ఉప్పు కారం నేయి (అప్పుడు నూనెలు తెలీవు. నేయి డిమాండు  పెరగడంతో ఆ కాలానికి సంబంధించిన సైంటిస్టులు పంట గింజల తైలం తీయడం కనిపెట్టారు. అప్పుడు అలాంటి తైలం సహాయంతో రథములు    వగైరా బండ్లకు కందెన తయారు చేసారు. ఎలాగైతే ప్రస్తుత సైంటిస్టులు గ్రీజు తయారు చేయడం మాదిరి. NECESSACITY IS  THE  MOTHER  OF  INVENTION కదా ) లాంటివి వాడుతూ నీళ్ళలో ఉడికించి తినేవారు. ఇది 60 % మంచిది. 40 % చెడ్డది. ఇది ఉమ్మడి కుటుంబం తీసుకునే పద్ధతి.
40 % మంచిది. 60 % చెడ్డది.
          నీళల్లో వుడికించడం త్రేతాయుగం వారు కనిపెట్టింది కదా! మరి మనం మాత్రం ఏమి తక్కువ అన్నట్లు ఈ ద్వాపరయుగం వారు నెయ్యి నూనెలతో వేపుళ్ళు కూడా మొదలు పెటారు. ఇది 40 % మంచిది. 60 % చెడ్డది. ఇది చిన్న కుటుంబాలు (నూక్లియర్ ఫ్యామిలీస్) తీసుకునే పద్ధతి. 
          4 . ఇక ఈ కలియుగంలో పై అన్ని రకాలుగా ఆహారం తీసుకుంటూ మరి కాస్త ముందుకెళ్ళి రెడీమేడ్ ప్రాసెస్డ్ ప్యాక్జేడ్ ఫుడ్ తింటున్నారు. ఇది 20 % మంచిది. 80 % చెడ్డది. వ్యక్తి పరంగా ఆహారాన్ని సంపాయించే  పద్దత. ఈ కాలంలో వివాహ బంధాల్ని విడాకులు పేరుతో త్రెంచుకుని ఒంటరిగా వుంటూ రెడీమేడ్ ప్రాసెస్డ్ ప్యాక్జేడ్ ఫుడ్ తింటున్నారు. 
ఇప్పుడు ఇదంతా చెప్పడం ఎందుకు 
          ఇప్పుడు ఇదంతా చెప్పడం ఎందుకు అంటే, మీ ఆరోగ్యం మీ ఇష్టం. మీ ఆరోగ్యం విషయంలో కనీసం పాసు మార్కులు సంపాయించాలంటే 40 % మంచిది 60 % చెడ్డది. అనే పద్ధతిని సెలెక్ట్ చేసుకోండి. కానీ, ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలంటే 60 % మంచిది 40 % చెడ్డది ని ఎన్నుకోండి. ఇది ఉమ్మడి కుటుంబాలు తీసుకునే పద్ధతి. చాలా మంచిది. ఎందుకంటె, అది శ్రీ కృష్ణుడి కాలం లోనిది. అన్ని యుగాల్లోకి ద్వాపర యుగం అసలయిన ధర్మమైంది. ఇది చాలా మందికి తెలిదు. (పూర్తి వివరాలు ధర్మమైన యుగం అనే బుల్లిటిన్లో చూడండి).
          కానీ, 80 %  మంచిది. 20 % చెడ్డది అయినా మంచిదే. 
          అలా కాదు. మేము 100 % మంచి దాన్నే సెలెక్ట్ చేసుకుంటాము అంటే మరీ మంచిది. 
          అలా కాదు, మేము 20 % మంచిది 80 % చెడ్డది అయినా పర్వాలేదు రెడీమేడ్ ప్రాసెస్డ్ ప్యాక్జేడ్ ఫుడ్ తింటాము. జబ్బులోచ్చినా పర్వాలేదు. మా దగ్గర కరెన్సీ వుంది. డాక్టర్లు వున్నారు. అంటే 
          మీ ఇష్టం  మీ ఆరోగ్యం. మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకునే హక్కు మీకు వుంది. కానీ, రెడీమేడ్ ప్రాసెస్డ్ ప్యాక్జేడ్ ఫుడ్ తిన్న తర్వాత మీ చేతిలో మిగిలే వేస్టును దయచేసి చెత్త కుండీలో వేయండి. అంతే కానీ, ఎవ్వరికీ అందకుండా దూరంగా కొండలలో, లోయల్లో,  కోనల్లో, వీధి కాలువల్లో, నీటి చెరువుల్లో పడేయకండి. ఆ హక్కు మీకు లేదు. 
           కొండలలో, లోయల్లో,  కోనల్లో పడ్డ వాటి వలన ఎన్నో జంతువులకు హాని. చెరువుల్లో పడ్డ వాటి  వలన ఎన్నో జలచరాలకు హాని. (అంతే కాదు, అవి చేపలైతే, ఆ చేపలను తిన్న మనుషులకూ హాని. ) వేది కాలువల్లో పడ్డ వాటి వలన పలు నగరాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. ఆ హక్కు మీకు లేదు. 
ఆలోచించండి మేధావుల్లారా! ఇది సత్యం. 
యువతా ఆలోచించండి.
          





No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...