నూతన వధూవరులకు విన్నపము

నూతన  వధూవరులకు విన్నపము
          పర్యావరణ పరిరక్షణలో మీరు పాల్గొనదలచారా? 
         అయితే మీరు ఏమి చెయ్యాలి? తెలుసుకోండి! ఆచరించండి!  
        మీ పిల్లలకు తినుబండారములు మీ ఇంట్లోనే చేసి పెట్టండి. ఆడుకునే వస్తువులు కోయ్యవి. మట్టివి కొని పెట్టండి. 
           అంతే మీరు పర్యావరణ పరిరక్షణ లో పాల్గోన్నట్లే!
        వివరంగా .................................................
పిల్లలకు తినుబండారలు మీ ఇంట్లోనే చేసి పెట్టండి
          మీ పిల్లలకు తిను బండారములు కొనదలచితే ఆ ఆలోచన మానుకోండి. దాని వలన కూడా పర్యావరణం కాపాడబడుతుంది. ఎలా అని
అందరూ అనుకుంటారు? ఈ మధ్య చాల మంది తినుబండారములు టీ.వి లలో ప్రకటనలు  చూసి రెడీమేడ్ ఫుడ్స్ కొని పెడుతున్నారు. దాని వలన సాలిడ్ వేస్ట్ ను మనం ప్రోత్సహిస్తున్నట్లే. ఆ సాలిడ్ వేస్ట్ ను సరైన పద్ధతి లో మనం రీ సై క్లింగ్ చేయలేము. కనుక దాన్ని ప్రోత్సహించకుండావుంటే పర్యావరణాన్ని కాపాడినట్లే. అంతే కాదు, ఆ తినుబండారాలు నిలువ ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను వాడుతారు. వాటి వలన పిల్లల ఆరోగ్యము దెబ్బతినడానికి అవకాశము కూడా వుంటుంది. ఆలోచించండి. మేధావులు కూడా ఆలోచించండి! ఎలా ఎందుకు చేస్తున్నారంటే ( వివరాలకు  కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనే బుల్లెటిన్ చదవండి ) కాబట్టి మన పిల్లల  ఆరోగ్యమే మహా భాగ్యము అని తెలుసుకోండి. అంతే కానీ, కరెన్సీ నోట్లే మహా భాగ్యము కాదు. సంపాదనలో పడి పిల్లలకు రెడిమేడ్ వి కొనిపెడుతుంటే మీ సంపాదన మళ్లీ డాక్టర్లకు  సమర్పించాలి. ఆలోచించండి!
          అలాగే, మీ పిల్లలను హోటల్ కు  తీసుకు వెళ్ళాల్సి వస్తే, తప్పని సరిగా అరిటాకు గానీ, విస్తర గానీ వేసే హోటల్ కు  తీసుకు వెళ్ళండి. మీ ఆరోగ్యం ఇప్పటికే ప్లాస్టిక్ పేపర్లు వేసే హోటల్ కు వెళ్లి చెడిపోయి వుంటుంది. అ  విషయం యిప్పుడు మీకు తెలీదు. డాక్టర్లకు బిల్లులు చెల్లించేప్పుడు గుర్తుకు వస్తుంది. కనుక కనీసం మీ పిల్లలని అయినా తప్పని సరిగా అరిటాకు లేదా విస్తర వేసే హోటల్ కు తీసుకు వెళ్ళండి. మీ పిల్లలను ఆరోగ్యంగా వుండేలా చూడండి.
          అలాగే వీధిలో ఇడ్లీ అమ్మేచోట నుండి,   హోటళ్ళ నుండి, టిఫన్, భోజనం  పార్సిల్స్ తప్పనిసరి అంటే మీ ఇంటినుండే ఒక   క్యారియర్ తీసుకుని వెళ్ళండి. దాని వలన మీకు ఆరోగ్యం. లేకపోతే ప్లాస్టిక్, సిల్వర్  కవర్లలో ఇచ్చే సాంబారు, రసాలు తినడం వలన మీరు స్లో గా పాయిజన్ ఎక్కించు కున్నట్లే. భవిష్యత్తులో జబ్బులు, డాక్టర్ల బిల్లులు తప్పవు. 
            కానీ, ఒక్కటి మాత్రమే సత్యం. టిఫన్ కానీ, భోజనం కానీ, ఇంట్లో చేసుకుని తింటే మంచిది.మీకు వంట రాకపోతే ఉమ్మడి కుటుంబం గా అత్త గారింట్లో వుండండి. అప్పుడప్పుడు అత్త దగ్గర కానీ, తోటికోడలు దగ్గర కానీ, నేర్చుకోండి. కాగితాల్లో సర్టిఫికెట్లు వలన కరెన్సీ చేతి వస్తుందేమో కానీ, చక్కటి ఆరోగ్యం మాత్రం  చక్కగా ఇంట్లో సభ్యులు ఇచ్చే సర్టిఫికెట్లు వలన వస్తుంది. వంటపని, ఇంటిపని వలన చక్కటి వ్యాయామం, ఆరోగ్యం ఆలోచించండి మహిళలూ!
ఆడుకునే వస్తువులు కొయ్యవి. మట్టివి కొని పెట్టండి. 
             మీ పిల్లలకు వాకర్ కొనదలచితే మీ ఊర్లో వున్నా వడ్రంగి (కార్పెంటర్) దగ్గరికి వెళ్ళండి. వాకర్ ను చేసి యిమ్మనండి. ఇది బజార్లో దొరికే ప్లాస్టిక్, అల్లుమినియం తో చేసినంత అందం గా ఉండక పోవచ్చును. కనీ, కొయ్యతో చేసిన వాకర్ తో కూడా మీ పిల్లలకు నడక అనే విద్య నేర్ప వచ్చును. పడిపోతారనే భయపడకండి. ప్లాస్టిక్, అల్లుమినియం చేసిన దాంట్లో పడిపోకుండా ఊయల మాదిరి వుంటుంది. దాని వలన పిల్లలు  అందులో పడి, పడి వారికి నడుము నిలవక పోవడం అనే జబ్బు వస్తుంది.   అలాగే పిల్లలు ప్రాకే వయస్సు లో కూడా కొయ్య అట వస్తువులు పిల్లల ముందు వేయండి. అప్పుడు ఆ వయస్సు లో వారికీ పండ్లు వచ్చే సమయంలో ఏదో ఒకటి కొరకడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి, పిల్లలు పొరబాటుగా ఆ వస్తువులను నోట్లో పెట్టుకున్నా ఏమీ కాదు. అలాగే, చిన్న పిల్లలు ఆడుకోవడానికి మట్టివి, కొయ్యవి, కొనిపెట్టండి. ప్రత్యేకించి విదేశాల నుండి దిగుమతి చేసుకున్న బొమ్మలను ప్రోత్సహించకండి. (వివరాలకు ఆట బొమ్మల్లో విష రసాయనం అనే బుల్లెటిన్ చూడండి). 
      ఆనాడు మహాత్మా గాంధీ వస్త్ర బహిష్కరణ  ఉద్యమం చేసారు. 
   ఈనాడు మనం విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం చేయవలసివుంది.       
      ఎందుకంటే విదేశాలలోతయారైన వస్తువులను ఇక్కడకు అంటే భారత దేశానికీ తెచ్చి భారతదేశా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకు అంటే గతంలో బ్రిటిషు వారు మన లో కొందరు రాజులకు ధనమును,  తుపాకులను ఎరాగ (లంచంగా ) చేపలను (వ్యాపారము పేరుతో మన సంపద అనే ధనమును) పట్టుకుంటూ  చివరకు  రాజ్యాలను  ఆక్రమిస్తూ వచ్చారు. అలాగే, ప్రస్తుతము  కూడా కొందరు మన నాయకులు ధనమును,  ఎరాగ (లంచంగా ) తీసుకుని చేపలను (విదేశీ దిగుమతి  వస్తు వ్యాపారము పేరుతో మన సంపద అనే ధనమును) వారికి యిస్తూ ప్యాకింగు అనే పేరుతో ఎన్నో టన్నుల చెత్తను తెచ్చుకుంటున్నాము. దానిని సరైన పద్ధతిలో రీ సైక్లింగ్ చేయటం లేదు. దాని వలన పర్యావరణం పాడవుతున్నది.  కాబట్టి మనం మరొక్క సారి మహాత్ముని తలచుకొని విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం కూడా చేపట్టవలసి వుంది. 
          అది మొదటగా మన పిల్లలు ఆడుకునే వస్తువుల నుండి ప్రారంభించుదాం! రండి! నూతన వధూవరులారా! మీరే ఈ ఉద్యమ సారధులుగా భావించి మీ పిల్లలకు కొయ్యవి, మట్టివి, అట వస్తువులను కొనిపెట్టండి.
పర్యావరణాన్ని పరిరక్షించండి.
ఫలితాలను అనుభవించి, ఆనందించండి.

          

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...