నిప్పులో అధర్మం

                నిప్పులో ఎలా అధర్మం పెరిగింది. 
                 ఒక వస్తువు కానీ, ఒక జంతువు కానీ, ఒక మనిషి కానీ నిప్పులో పడితే నల్లగా మాడి బూదిడైపోతుంది. ఆ ప్రకారం గా నిప్పుకు సమానమైనదిగా ప్రస్తుతం విద్యుచ్చక్తి. అందుకే శవాలను కరెంటులో కాలుస్తున్నారు. ఇప్పుడు మనకు ఎంత కరెంటు కావాలి? అనేదే ప్రశ్న. ప్రజలు ఉపయోగిస్తున్నారు అని కరెంటును తయరుచేస్తున్నారా? లేక కరెంటును తయారు చేసి ఇస్తున్నారని ప్రజలు ఉప్పయోగిస్తున్నారా? ఆలోచించండి. మేధావుల్లారా! ముఖ్యం గా యువత.
            పూర్వం పగలు సూర్య కాంతిని వాడుకునేవాడు మానవుడు. చీకటిపడితే చంద్ర కాంతిని వాడుకునేవాడు. అయితే, చంద్రుని వలన కొద్ది రోజులు చీకటి రాత్రుళ్ళు  వస్తున్నాయి. అప్పుడు అనేక జంతువులను భయపెట్టడానికి రాత్రిళ్ళు నిప్పును కనిపెట్టాడు.  ఆ వెలుగులో తనను తాను కాపాడుకున్నాడు.  ఆ వెలుగులోనే పగలు మిగిలిన పనులు చేసుకునే వాడు.  అయితే ఆ నిప్పును ఎంత కావాలో అంతే వెలిగించుకుని వాడుకునే వాడు. అంతే కానీ , అవసరానికి  మించి వేసుకుంటే పెద్ద గాలి వీచి మంటలు లేస్తే ప్రమాదం కదా! తర్వాత కొంత కాలానికి నిప్పు కుదరదని నిప్పు ద్వారా మంట , మంట ద్వారా దీపం అనేది కనిపెట్టుకున్నాడు. దీపం కూడా అవసరానికి ఎంతో అంతే వాడుకునే వాడు. అయితే యిక్కడ తమాషా.. ఏమంటే , సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు చిన్న నిప్ప్పు వుండేది ఎందుకు? వంటకు . చీకటి పడ్డాక మంట వుండేది ఎందుకు? ఇతర జంతువుల నుండి రక్షణ కొరకు. దీపం వచ్చాక మంటకు బదులు గా చీకటి పడ్డాక ఉపయోగించే వారు. అయితే నార్మల్ గా వుండేది. ఎలా? ఒక దినంలో 50 % మాత్రమే (చీకటి పడ్డాక) వాడుకునే వారు. దాన్నే నార్మల్ గా  చెప్పొచ్చు. 
          అయితే సైన్సు ప్రగతి పథం అంటూ విద్యుచ్చక్తి వచ్చింది. మరి మనం ప్రస్తుతం ఆ కరెంటును నార్మల్ గా వాడుకుంటున్నామా ? లేదా? ఆలోచించండి మేధావుల్లార! అవసరానికి మించి ఉపయోగిస్తున్నాము బాగా ఆలోచించండి. మరి అధర్మం పెరిగినట్లే కదా! పైగా తయారీదారులు విద్యుచ్చక్తి ని సేవా రంగం నుండి వ్యాపార రంగం క్రింద మార్చుకోవడం వలన అవసరానికి మించి తయారు చేసి గోడవున్లలో దాచినట్లు కరెంటునూ దాచటానికి రెడీ అవుతున్నారు. అలా చేసే ఈనాడు జపాన్లో సమస్య. 
నిప్పులో ధర్మ సంరక్షణ
            యిప్పుడు సాయి సైన్యం ఏమి చేస్తే నిప్పులో ధర్మ సంరక్షణ జరుగుతుంది. అంటే ముందు గా కరెంటు ఎలా తయారు అవుతుంది తెలుసుకోవాలి. 1 . నీటి ద్వారా నిప్పు (జలవిద్యుత్తు ) 2 . గాలి ద్వారా నిప్పు ( పవన విద్యుత్తు) 3 . ఆకాశం ద్వారా నిప్పు (సోలార్ విద్యుత్తు) 4 . భూమి ద్వారా (గ్యాస్, కిరోసిన్ వైగరాలు) ఈ నాలుగింటి ద్వారానే విద్యుత్తు సంపాయించాలి. అదే ధర్మం. ఇది సత్యం యిదే సత్యం. ఎందుకు? అనే వివరాలులో  http://www.sathyaanveshana.blogspot.com   చూడండి. కానీ, అణు విద్యుత్తు అధర్మం. ఎందుకంటె....నాలుగు పంచ భూతల నుండి ఐదవ పంచ భూతాన్ని పొందడంలో  ధర్మం వుంది. దాన్ని ప్రయోగం చేసారు మానవులు సైన్సు అంటూ. తప్పులేదు. కానీ, పంచభూతాల ద్వారా కాకుండా అణువులతో  ప్రోయోగించి నిప్పును పొందారు. యిది అధర్మం. అందుకే జపాన్లో భూకంపం. కాబట్టి పూర్తిగా అణు విద్యుత్తును మానేయాలి అదే ధర్మం. 
         తర్వాత 24 గంటల్లో ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి. అదే ధర్మం. ఎక్కువ వాడుకుంటే అధర్మం.
        ఉదా: నార్మల్ అంటే 50 % కదా! అంతే వాడుకోవాలి. దానికి ఎక్కువ వాడిన , తక్కువ వాడిన సమస్యే.... కాబట్టి సాయి సైన్యం అనే వారంతా 50 % వాడుతూ వుంటారు. (పూర్తి వివరాలు కరెంటును ఎంత వాడుకోవాలి. చూడండి.) ఉదా: ప్రశాంతి నిలయం లో పట్టణ వాటికలో ఎన్ని గంటలకు  లైట్లు అర్పుతారు. దాన్ని చూసి భక్తులు ఏమి నేర్చుకోవాలి. వారి వారి ఇళ్ళల్లో కూడా అన్ని గంటలకే ఆర్పేసి పడుకోవాలి. ప్రశాంతి నిలయంలో మాదిరి ఉదయమే 3 గంటలకు లేచి స్నానం సుప్రభాతం, నగర సంకీర్తన లో పాల్గొంటే ఎలా వుంటుంది. ప్రశాంతి నిలయంలో మాత్రం ప్రతిరోజు నగర సంకీర్తనలో పాల్గొని మన ఊరులో మాత్రం నెలకు ఒక రోజు నగర సంకీర్తన ఎందుకు చేస్తున్నారు? మొత్తం ప్రపంచాన్నే ప్రశాంతి నిలయంగ మార్చినప్పుడే సాయి సైన్యం ధర్మ సంస్థాపనలో పాల్గొన్నట్లు. అంటే ఒక వైపు ధర్మ సంస్థాపన మరో వైపు ప్రపంచానికి ప్రశాంతిని అందించినట్లు లెక్క. అప్పుడు ప్రపంచమంతా మీలో వున్న ప్రేమను పంచినట్లు. అదే సత్యం.   అలా చేసే వారే సాయి సైన్యం. మిగిలిన వారంతా కేవలం సాయి భక్తులు , సేవకులు. ధర్మ సంస్థాపనకు వచ్చిన సాయి ప్రతి ఒక్కటి చేసి చూపించాడు కానీ అర్థం చేసుకోలేక పోతున్నారు.
             తర్వాత, వాషింగ్ మిషన్, మిక్సీ, ఐరన్ బాక్సు, లాంటి గృహోపకరణలను  వీలయినంత తక్కువ వాడాలి. అంటే..... ఒకావిడ  నాతో యిలా అన్నది. " ఏమండీ! మా యింట్లో ౩ వాటర్ ఫిల్టర్లు వున్నయి కొత్తవి ఎవరికైన కావాలంటే చెప్పండి. తక్కువ ధరకు యిచ్చేస్తాము". "అన్ని ఎక్కడివి? " అని నేను అడిగాను. "ప్రజంటేషన్ లు వచ్చాయి. అవి రక ముందే మనం ఒక్కటి కొనుక్కునం. అది యింట్లో వాడుకున్తున్నాం." అన్నది. దీన్ని బట్టి ఏమి అర్థం అయ్యింది. తయారీదారులు ఉత్పత్తి చేస్తున్నారని మనం కొంటున్నామా! లేక మనం కొంటున్నామని తయారు చేస్తున్నారా! ఆలోచించండి. కాబట్టి సాయి సైనికులు అనేవారు ప్రజంటేషన్ లు తీసుకోరు ఎవ్వరికీ, ఏమీ యివ్వరు. అలాగే వారి యింట్లో ఎక్సస్ గ (అధికంగా) వున్నది వెంటనే లేని వారికి ఉచితంగ యిస్తారు.  ఉచితం అంటే ఏదో సిస్టం పెట్టుకోవాలి కదా! ప్రస్తుతం నారాయణ సేవ మాదిరే. అప్పుడప్పుడు ఎక్సస్ గ వున్న బట్టలను పంపిణీ లాగే, సాయి సైనికులంత అపాత్ర దానం కాకుండా  దానం చేస్తారు. ఆ పైన ఎవ్వరికీ బహుమతులు యివ్వరు , తీసుకోరు. దీని వలన కూడా కరంటు అదా అవుతుంది. పూర్తి వివరాలు రెగ్యులర్ గా చదువుతూ వుండండి. ఎవరూ కొనటం లేదని తయారీ దారులు మెల్లగా తగ్గిస్తారు. 2 షిప్ట్లువుంటే 1 షిప్తుకు మారుతారు. 1 షిప్టు వుంటే మరొక తయారీ దరుతో విలీనం అవుతారు. ఆ ప్రకారంగా అదా అవుతుంది. అప్పుడు ప్రపంచంలో అణు విద్యుత్తు తయారీ అవసరం రాదు.( అది బ్రహ్మ సృష్టిలో సింహం మాదిరి. అణు విద్యుత్తు తయారీని బోనులో పెట్టాలి లేదంటే అపాయం).ఇలాంటివి ఎన్నో వున్నాయి. ప్రస్తుతానికి ప్రారంభంలో సాయిసైనికులు ఈ ప్రకారంగా ధర్మసంస్థాపనలో పాల్గొంటారు. పాల్గొన్నవారంతా  సాయి సైనికులే.

 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...