నీటిలో అధర్మం ఎలా పెరిగింది
స్వచ్చమైన నీరు గతంలో బావిలోను, నుయ్యిలోను, మంచినీటి చెరువులోను,
లభించేవి. అయితే ఆ నీటిలో మనకు తెలీని కలుషితాలు వున్నాయి. వాటి వలన
జబ్బులు వస్తాయి అని చెప్పి, మనకు తెలిసేలాగా అందులో స్లో పాయిజన్
కలుపుకుకుని త్రాగుతున్నము. ఎలాగైనా జబ్బు రావలసిందే. కానీ నాచురల్ గా,
ప్రకృతిపరంగా తెలీని కలుషితాల వలన జబ్బు వస్తే అది ధర్మం. మనకు తెలిసేలా
స్లో పాయిజన్ కలుపుకుని జబ్బు తెచ్చుకోవడం అధర్మం. అంతే కాదు ఈ అధర్మంతో
భూత దయ అనేది కూడా చచ్చిపోతుంది.నేను చెప్పేది చాలామందికి అర్థం కాదు.
ఒక
వేళ బావి నీళ్ళు, చెరువు నీళ్ళు ఉప్పగా వుంటే, వాటిని ప్రత్యేకగం గా
స్నానాలకు వాడుకునే వారు. ఎందుకంటె ఉప్పునీళ్ళ స్నానం సముద్ర స్నానం తో
సమానమని. అది ఆరోగ్యం అని అందులో స్విమ్మింగ్ కూడా చేసే వారు. అందరూ
ఆరోగ్యంగా వుండేవారు. (వివరాలకు పూర్వం నీటిని ఉపయోగించే పద్ధతి అనే
బుల్లెటిన్ చూడండి.)
అయితే సైన్సు, ప్రగతి అంటూ మెడికల్ కాలేజీల సంఖ్య పెంచి డాక్టర్ల సంఖ్య
పెంచి వారిని పోషించడానికి బలవంతంగా ప్రజలకు అనారోగ్యాలు రావడానికి
పంచభూతాలను నాశనం చేస్తూ ప్రజలకు అనారోగ్యాలను తెప్పిస్తున్నారు రాక్షస
మేధావులు. (వివరాలకు కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి బుల్లెటిన్ చూడండి.)
అది అధర్మం. అధర్మం పెరగవచ్చు కానీ, ధర్మంతో బ్యాలన్సుగా పెరగాలి. అంతే
కానీ, ధర్మాని అణగద్రొక్కి అధర్మం పెరుగుతూ వుంటే, అప్పుడు అవతారం రావాలి.
అందుకే సాయి అవతారం వచ్చింది. ధర్మ సంస్థాపనలో పాల్గొనే సాయి సైన్యం నీటి
కాలుష్యం బ్యాలన్సు చేయడానికి ముందు ఎన్ని రకాలుగా నీటిలో అధర్మం
పెరుగుతుందో కొంతైనా తెలుసుకోవాలి. అప్పుడు బ్యాలన్సు చేయడానికి చక్కగా
వుంటుంది.
చీరాల - పేరాల ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చుకోండి. క్లుప్తంగా చీరాల
గ్రామాన్ని ఆనాటి బ్రిటీషు వారు ఉన్నపళంగా మునిసిపాలిటీగా అవసరం లేకపోయినా
చేసారు. అప్పుడు ధర్మ సంస్థాపన కోసం వచ్చిన మహాత్మా గాంధీ ధర్మసంస్థాపనలో
భాగమే పేరాల. (వివరాలకు మహాత్మా గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదవండి.)
ఆ
ప్రకారంగా అవసరం లేకపోయినా గ్రామాలను మునిసిపాలిటీ లుగా , మునిసిపాలిటీ
లను కార్పోరేషన్ లుగా మార్చి, నీటి కరువును సృష్టిస్తున్నారు. ఎందుకంటె,
గ్రామంలో వున్న చెరువులను, బావులను మాయం చేస్తున్నారు. (కొళాయిలు వేస్తున్నారు. చెరువులు, బావులు ప్రకృతి అంటే కొళాయిలు వికృతి.)
చెరువులు బావులు ఎందుకు పూడ్చేస్తారు? ఎవరు పూడిపిస్తారు? అంటే ఎవరి జాతక
చక్రంలో అయితే చెరువులు బావులు త్రవ్విస్తారు అని వుంటే వారు
త్రవ్విస్తారు. అంటే
ఎవరి జాతక చక్రంలో అయితే చెరువులు బావులు పూడిపిస్తారు అని వుంటే వారు
పూడిపిస్తారు. (పూర్తి వివరాలకు రచయిత బ్లాగర్ ను కలవండి. లేదా సమీప
జ్యోతిష్కుని కలవండి.)
అంటే త్రవ్వించేవారు దేవతలైతే, పూడ్పించేవారు రాక్షసులు. ఎందుకంటె
బావుల్లో నీళ్ళు రోజూ తోడే దాని వలన ప్రజలకు మంచి వ్యాయాయం జరిగి
ఆరోగ్యంగా వుండేవారు. కొళాయిల వలన వ్యాయాయం లేక అనారోగ్యం పాలు
అవుతున్నారు. అందులో త్రాగు నీటిలో ఎక్కడో డ్యాముల్లో నిల్వ నుండి తీసు
వచ్చి. వాటర్ ట్యాంకుల్లో నిల్వ చేసి ఆ నీటిని శుభ్ర పరచాలని రసాయనిక
మందులు వాసి స్లో పాయిజన్ ను ఎక్కిస్తున్నారు ప్రజలకు. కంటికి కనపడని
నీటిలో వున్న జీవాలకు ఒక్క రోజుకే హాని చేసే రసాయనిక మందు ప్రజలకు మెల్ల
మెల్లగా నైన హాని చేయదా?ఇది చాల మందికి అర్థం కాదు. (ఇదంతా
ఎందుకు? కాబోయే డాక్టర్లను బ్రతికించ డానికి. వారిని అంటే డాక్టర్లను
బ్రతించ డానికే B . T . వంకాయను, B T ప్రత్తిని కనిపెట్టారు. ఎందుకంటె
కాలుష్యాన్ని పెంచడానికే. చాల మందికి అర్థం కాదు.) ఆ ప్రకారంగా చెరువులను
బావులను మూలాన పెట్టి కొళాయి సామ్రాజ్యాన్ని ప్రారంభ చేసారు.
అయితే కొందరు అనుకోవచ్చు. స్వచ్చమయిన నీరు అని చెప్పే చెరువులు, బావులు
నుయ్యి లో నీరు త్రాగితే ఎవరికైన అనారోగ్యం పాలైతే .....అవును
ఆరోగ్యం చెడిపోవాలి అదే ధర్మం. అప్పుడు ఆరోగ్యం దెబ్బ తిన్న వారు
డాక్టర్లను ఉపయోగించుకోవాలి. అంతే కానీ, విద్యనే వ్యాపారంగా మర్చి అందులో
డాక్టర్లను ఎక్కువ గా తయారు చేసి వారిని పోషించడానికి ప్రజలకు అనారోగ్యాలు
ఎలా వస్తాయా? అని ప్లాను వెయ్యడం అధర్మం. అయితే అనారోగ్యం ఎవరికి
వస్తుంది? సంపూర్ణ ఆహరం తినని వారికి వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిన
వారికి వస్తుంది. అందరికీ రాదు. సంపూర్ణ ఆహరం అంటే తీపి, పులుపు, కారం,
చేదు, ఉప్పు వగరు, ఈ ఆరు సమానంగా వుండాలి. అదే ధర్మం. ఆ ధర్మం తేడా వస్తే
అధర్మం. అప్పుడే జబ్బు. ఉప్పు ఎక్కువ తింటే ఒక రకం జబ్బు. తీపు ఎక్కువ
తింటే ఓకే రకం జబ్బు. ఇలా ఆరు రకాల శారీరక వ్యవస్థ మండలాలకు
(Systems in Human Being ) ఆరు రకాల జబ్బులు. ఆ ఆరు రుచుల సమానమయినప్పుడే
ఆరు అరిషడ్వర్గాలను నియంత్రించగలం. ఆ ఆరు రుచులే ఆరు రకాల శారీరక వ్యవస్థ
మండలాలను నియంత్రిస్తుంది.
ప్రస్తుతం నీటి కాలుష్యం లో ఎన్నో రకాలు. అందులో ఒకటి మునిసిపాలిటీలు.
పంచాయతీలను ఎందుకు మునిసిపాలిటీలుగా చేస్తున్నారు. అంటే బ్రహ్మ కనిపెట్టిన
సింహాన్ని బోనులో పెట్టినట్లు, సైంటిస్టు కనిపెట్టిన శుద్ధి చేసే మిషన్లను
బోనులో పెట్టకుండా వాటిని ఉపయోగించడానికి పంచాయతీలను మునిసిపాలిటీలుగా చేస్తున్నారు.
మనం
ఉపయోగించిన నీళ్ళను పంచాయతీలలో నిరుపయోగం గా భూమిలోనికి వదిలేస్తున్నామని,
మునిసిపాలిటీలుగా చేసి సిమెంటు రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టి దాని ద్వారా
వచ్చే మురికినీరుని శుద్ది చేసి మళ్లీ మనకు కొళాయిల ద్వారా మంచినీరు అని
పంపిస్తున్నారు. అది పూర్తిగా శుద్ది అయిందో లేదో అని అనుమానం తో మళ్ళీ
దానికి స్లో పాయిజన్ లాంటి బ్లీచింగ్ పొడిని వేసి మనకు జబ్బులు రావాలని
చేస్తున్నారు. ఇది అధర్మం. మురికి నీరు భూమిలోనికే వెళ్ళాలి అప్పుడే భూమిలో
నీటి శాతం తగ్గకుండా వుంటుంది. భూమినుండి మనం నీరు తోడుకోవాలి. మనం వాడిన
నీళ్ళు తిరిగి భూమికి యివ్వాలి. ఈ చక్రం ఇలాగే తిరగాలి. అదే ధర్మం. కాబట్టి
సాయి సైనికులు ఎలా స్పందిస్తారో ఆలోచించుకోండి.
No comments:
Post a Comment