పర్యావరణ పరిరక్షణ


TEAM ( Tiru 's Environmental Awareness Movement )        

4 - 2  - 12 

                      కలియుగం అంతం ప్రారంభం అయ్యింది. 
                  కృతయుగం ఆరంభం ప్రారంభం అయ్యింది. 
                  పర్యావరణను దెబ్బ తీయడమే  కలియుగాంతం.
                  ప్రకృతిని గుప్పిట బంధించమే కలియుగాంతం 
 
5 - 2 - 12 
                 కృత , త్రేతా, ద్వాపర, కలి అనే సనాతన సంస్కృతి తో 
             పరిచయంలేని వారు కలియుగంతాన్ని"గ్లోబల్ వార్మింగ్" అంటారు   
6  - 2 - 12 
                 కలియుగంలో పంచ భూతాలను శాసిస్తున్నారు మనవ రూపం
                ధరించిన రాక్షసులు ( నర రూప రాక్షసులు ) తత్పలితమే "గ్లోబల్ వార్మింగ్ "
                 కృత యుగంలో  పంచ భూతాలను ప్రార్ధిస్తారు మనవ రూపం
         ధరించిన దేవతలు ( నర రూప దేవతలు ) తత్పలితం కోసం ఎదురుచూడండి.
7 - 2 -12 
          బ్రహ్మ సృష్టించిన ఎన్నో జంతువులలో కొన్నింటిని "జూ" లో బందించి పెంచుతున్నాము. వాటి వలన హాని కలుగుతుందని !  
           అలాగే సైంటిస్టు కనిపెట్టిన కొన్నింటిని కూడా నాలుగ్గోడల మద్య బంధించి ఉంచాలి. లేదంటే అవి సింహంలా. పెద్ద పులిలా మానవుల్ని తినేస్తుంది. 
8 - 2 - 12
           కృత యుగంలో గాలిలో ఆక్సిజన్ శాతం కోసం యజ్ఞాలు, యాగాలు, ధ్యానాలు తప్పక చేస్తారు. సూర్య భగవానుని తప్పక ఆరాధిస్తారు మానవ రూపంలో వున్న దేవతలు.
9 - 2 - 12  పర్యావరణ పరి రక్షకులే దేవతలు  
                 పర్యావరణ భక్షకులే రాక్షసులు 
                 తటస్తులే మానవులు. ఏ జాతిలో మీరు 
                 వుండదల్చుకుంటారో  ఆలోచించుకోండి 
10 - 2 - 12 రాత్రులు త్వరగా పడుకోవడానికి ప్రయత్నించండి. 
                 వీలయితే పది గంటలకే
                 దాని వలన కూడా పర్యావరణం కాపాడ బడుతుంది.
11 - 2 - 12 జిల్లా కలెక్టర్లు ప్రజలను రక్షిస్తారు. 
                  వేస్ట్ కలెక్టర్లు ప్రకృతి ని రక్షిస్తారు.
                  ఈ తరం ప్రజలకు సేవ జిల్లా కలెక్టర్లు చేస్తున్నారు. 
                  భవిష్యత్తు తరాల ప్రజలకు సేవ  వేస్ట్ కలెక్టర్లు చేస్తున్నారు.
12 - 2 - 12  ప్లాస్టిక్ ఉత్పత్తి పూర్తిగా  నివారించి అందులో నిమగ్నులైన   వారంతా వ్యవసాయంలోనికి మారితే 50 % సమస్యలు తీరిపోయినట్లే.
13 - 2  - 12  కృతయుగంలో నీరు దొరకక 
                    మాఘ స్నానాలు, కార్తీక స్నానాలు  అంటూ 
                    వీలైనప్పుడు సముద్ర స్నానాలు, నదీ స్నానాలు 
                    చేస్తారు మానవ రూపంలో వున్న దేవతలు
14 - 2 - 12 ప్లాస్టిక్ కవర్లలో వుండగా కొన్ని రసాయనిక చర్యలు జరిగి అందులోని ఆహారం విష పదార్థాలుగా తయారవుతాయి. అ ప్రకారంగా మీరు రోజూ ప్లాస్టిక్ ప్యాకింగ్ లో వున్నవి తినండి. త్రాగండి. మీ పిల్లలుకూ తినిపించండి. త్రాగించండి. స్లో పాయిజన్ ని మీలోను, మీ పిల్లలలోను యిక్కించుకొని ఆయుష్యును తగ్గించుకొండి . ఎవ్వరు ఏమి అనరు. ఎందుకంటె మీరు స్వతంత్రులు. మీ శరీరం మీ ఇష్టం. మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకునే హక్కు మీకు వుంటుంది.  కానీ, మూగ జీవాలైన పశువుల ప్రాణాలు తీసే హక్కు మీకు లేదు. ముఖ్యం గా మూగ జీవాల హక్కుల సంఘం ఒప్పుకోదు. లోయలో పడ్డ వాటి వలన ఎన్నో జంతువులకు హాని. చెరువులో పడ్డ వాటి వలన ఎన్నో జలచరాలకు హాని. కాబట్టి తిన్న తర్వాత ప్లాస్టిక్ వేస్టును దగ్గరలో నున్న చెత్త కుండీలో వెయ్యండి. దగ్గరలో  లేకుంటే మీ సంచిలో వేసుకుని కుండీ కనపడగానే వెయ్యండి.
15 - 2 - 12 --- ఇంటింట చెత్త సేకరణ ( రిక్షా ) పథకము ద్వారా పరిసరాలను శుభ్రంగా వుంచండి. ఉపయోగపడే చెట్లను పెంచండి. వాతా వరణాన్నిసమతుల్యం  చెయ్యండి. రహదారుల్లో చెత్త చెదారం వేయకండి. తడిచెత్తను భద్ర పరచండి, సేంద్రియ ఎరువుగా మార్చండి. పొడి చెత్తను రీ సైక్లింగ్ కు పంపండి.
16 - 2 - 12 --- వ్యర్థ పదార్థాన్ని సృస్టించకూడదు. అది మనకు వ్యర్థం అని అనిపిస్తే దాన్ని మరొకరికి ఉపయోగించు కునే వారికీ ఉచితంగా యివ్వండి.
17 - 2 - 12 --- ఒకప్పుడు మనం అన్ని రకాలు అంటే ఆహార పదార్థాలు ఇండ్లలో వండుకుని తినేవారము. కాబట్టి చెత్త తక్కువ పడేది. కానీ , ఏనాడు ప్రతి ఒక్కటి రెడీమేడ్ ప్రాసేస్డ్ ఫుడ్ తింటూ (ఆరోగ్యాన్ని పడుచేసుకుంటూ) మన ఇంటికి చెత్తను తెస్తున్నాము.
18 - 2 - 12 --- మన కోసం ( SELF ) పంచభూతాలను (గాలి, నీరు, భూమి, ఆకాశము, నిప్పు ) పరిశుభ్రంగా ఉంచుకోవడమే పరిసరాల పరిశుభ్రత . ఇతరుల కోసం( OTHERS ) (మన వారసుల కోసం) పంచభూతాలను (గాలి, నీరు, భూమి, ఆకాశము, నిప్పు ) పరిశుభ్రంగా వుంచడం పర్యావరణ పరిశుభ్రత.  వివరాలకు www .teambyindian .in 
19 - 2 - 12 ---   ఆనాడు మహాత్మా గాంధీ వస్త్ర బహిష్కరణ  ఉద్యమం చేసారు. ఈనాడు మనం విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం చేయవలసివుంది. ఎందుకంటే విదేశాలలోతయారైన వస్తువులను ఇక్కడకు అంటే భారత దేశానికీ తెచ్చి భారతదేశా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. వివరాలకు http://alochinchandimedhavullara.blogspot.in/p/blog-page_5284.html 
20 - 2 - 12 ---  ఇప్పుడు ప్రపంచంలో రెండు పార్టీలు. 
                       1 . పర్యావరణ ప్రేమికుల పార్టీ. 
                       2 . కాలుష్య ప్రేమికుల పార్టీ. 
                       ఏ పార్టీ వారు మీరు? ఆలోచించండి
21 - 2 - 12  ---  ఉమ్మడి కుటుంబాల వలన పర్యావరణ పరిరక్షింప బడుతుంది.  చిన్నకుటుంబాల వలన కాలుష్యం పరిరక్షింప బడుతుంది
22 - 2 - 12 --- సింగపూర్ లో రోడ్లకు సెలవులు వుంటాయి . వారానికి ఒక రోజు ఆ రోడ్డు మీద ఎటువంటి వాహనాన్ని అనుమతించరు. మీరు కూడా మీ గ్రామములో, మీ పట్టణములో, మీ నగరములో నెలకు ఒక రోజు అన్ని వాహనాలకు సెలవు ప్రకటించి పర్యావరణాన్ని కాపాడటానికి ప్రయ త్నించండి 
23 - 2 - 12 --- PCB (Pollution Control Board ) పర్యావరణ ప్రేమిక PCBAA (Pollution Control Board Appellate Authority ) మాత్రం కాలుష్య ప్రేమిక 
24 - 2 - 12 --- పర్యావరణం అనేది తరతరాలుగా  అందివస్తున్న వారసత్వ సంపద. దానిని కాపాడి భావి తరాలకు అందివ్వాలి. అది మన భాద్యత.
25 - 2 - 12 --- పర్యావరణ పరిరక్షణ, చైతన్యము పై ఆసక్తి కలిగినవారు కావలెను. వివరములకు : 9395383173 కి ఫోన్ చేయండి
26 - 2 - 12 --- గాజు, స్టీలు గ్లాసులో టీ, కాఫీ  త్రాగేవారు, అమ్మేవారు పర్యావరణ ప్రేమికులు. పేపరు, ప్లాస్టిక్కు కప్పులలో త్రాగేవారు, అమ్మేవారు కాలుష్య ప్రేమికులు. మీరు ఏ ప్రేమికులు? ఆలోచించండి.
27 - 2 - 12 ---  ఇంటి ముందు ఆవును, గేదను పిలిపించుకుని, పలు పిండించుకునేవారు ఆరోగ్యం అనే ఆస్తిని సంపాయించే వారు / పర్యావరణ ప్రేమికులు.  ఇంటి ముందు ప్లాస్టిక్ కవర్లలో పలు తెప్పించుకునే వారు జబ్బులు అనే ఆస్తిని సంపాయించే వారు / కాలుష్య ప్రేమికులు. 
28 - 2 - 12 ---  కారం, ధనియాలు పసుపు లాంటి ముడి పదార్థములను  కొనుక్కుని  పిండి పట్టించుకుని ఉపయోగించే వారు ఆరోగ్యం అనే ఆస్తిని సంపాయించే వారు / పర్యావరణ ప్రేమికులు.  రెడీమేడ్ కారం, ధనియాలు, పసుపు వగైరా పొడులను ప్యాకెట్లలో కొనుక్కుని ఉపయోగించే వారు జబ్బులు అనే ఆస్తిని సంపాయించే వారు / కాలుష్య ప్రేమికులు
29 - 2 - 12 ---  వారి వారి పట్టణ పరిధిలో తయారయ్యే స్వీట్స్, సేవరిస్, కొనుక్కుని తినేవారు ఆరోగ్యం అనే ఆస్తిని సంపాయించే వారు / పర్యావరణ ప్రేమికులు. పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటి తయారయ్యే ప్రాసెస్డ్ (నిలవ వుండే) స్వీట్స్, సేవరిస్  కొనుక్కుని తినేవారు జబ్బులు అనే ఆస్తిని సంపాయించే వారు / కాలుష్య ప్రేమికులు
1 - 3 - 13 ---  మూడో ప్రపంచ యుద్ధం మొదలైయ్యింది . 
                     కత్తులతో కాదు, బాంబులతో కాదు, 
                     కరెన్సిలతో యుద్ధం మొదలైయ్యింది. 
                     పర్యవసానం .......కాలుష్య ప్రేమికులు  పెరుగుతారు. 
                                               పర్యావరణ ప్రేమికులు తగ్గుతారు. 
                                              చెత్తను మరింత సృష్టిస్తారు. 
                                              జబ్బులనే ఆస్తిని పెంచుకుంటారు. 
తప్పదు కదా! రీ సైక్లింగ్ కంపెనీలు, ఫార్మస్యుటికల్ కంపెనీలు, 
కాబోయే డాక్టర్లు బ్రతకడానికి అదొక మార్గం కదా.
2 - 3 - 12 --- ఇందుగలడందు లేదని సందేహంబు వలదు . . . . . . . అని తనలోను, ఎదుటి వారిలోనూ, లేదా కనీసం తన జిల్లాలోని దేవాలయాల్లోనూ దర్శించి ఇంటికి వచ్చి వండుకుని కృష్ణా, రామా అని అనుకుంటూ తినేవారు (వీరికి భగవంతుడు సర్వాంతర్యామి) ఆరోగ్యం అనే ఆస్తిని సంపాయించే వారు / పర్యావరణ ప్రేమికులు. ఇక్కడ లేదు, అక్కడ లేదు, మరి ఎక్కడ వున్నాడు అని జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, దాటి దేవాలయాలు దర్శించి అక్కడ కూడా కనపడక చివరకు రకరకాల నీళ్ళు త్రాగి, ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫూడ్స్ తిని తర్వాత డాక్టర్లను దర్శించేవారు ( వీరు ప్రాణం వదిలిన తర్వాత కూడా భగవంతుణ్ణి చూడలేరు.) జబ్బులు అనే ఆస్తిని సంపాయించే వారు / కాలుష్య ప్రేమికులు
3 - 3 - 12 --- పర్యావరణాన్ని పాడుచేద్దాం రండి. 
                     కాబోయే డాక్టర్లను పోషిద్దాం రండి.
4 - 3 - 12 --- టీ. వి. ప్రకటనల్లో చూసి రెడీమేడ్ ఫుడ్స్ పిల్లలకు కొనిపెడుతున్న వారు కాలుష్య ప్రేమికులు. ఎందుకంటె దాని వలన సాలిడ్ వేస్టును ప్రోత్సహిస్తున్నారు. దాన్ని సరియైన పద్దతిలో రీ సైక్లింగ్ చేయలేము. 
5 - 3 - 12  --- 1 .  యువతైన మేము సైకిళ్ళను తప్ప మోటారు సైకిళ్ళు నడపము. పర్యావరణాన్ని పరిరక్షిస్తాము. దాని వలన చక్కటి వ్యాయామము మాకు జరుగుతుంది. భవిష్యత్తులో షుగరు, బి. పి. లు  రావు. 
      2 . అలాగే ప్లాస్టిక్ ను, పాలిథిన్ ను, పాలిమర్, పేపరు  క్యారీ బ్యాగులను వాడము. గుడ్డ సంచులే వాడుతాము.
          3 . రసాయనిక ఎరువులతో పండించిన పంటలు మేము తినము. సేంద్రియ ఎరువులతో పండించిన వాటినే  తింటాము. ఒక వేళ అందులో కల్తీ అవుతుందని తెలిస్తే సేంద్రియ ఎరువులతో మేమే పండించుకుని తింటాము. దాని వలన చక్కటి ఆరోగ్యం. ప్రకృతికి చక్కటి వాతవరణం.
          అని ప్రతిజ్ఞ చేయండి. అప్పుడు మేధావులనే సామాన్యులు,
                                                     సైంటిస్టు లానే సామాన్యులు,
                                                     వ్యాపారులనే సామాన్యులు,
                                                     ప్రజా నాయకులనే సామాన్యులు,
మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. యువతలోని మేధావుల్లరా!  ఆలోచించండి.
6 - 3 - 12 ---  నూతన  వధూవరులకు విన్నపము
          పర్యావరణ పరిరక్షణలో మీరు పాల్గొనదలచారా?  అయితే మీరు ఏమి చెయ్యాలి? తెలుసుకోండి! ఆచరించండి! పిల్లలకు తినుబండారములు మీ ఇంట్లోనే చేసి పెట్టండి. ఆడుకునే వస్తువులు కోయ్యవి. మట్టివి కొని పెట్టండి.  అంతే మీరు పర్యావరణ పరిరక్షణ లో పాల్గోన్నట్లే! వివరంగా ............................... http://alochinchandimedhavullara.blogspot.in/p/blog-page_5284.html

21 - 3 - 12  --- అడగక ముందు ఇచ్చేవారు దేవతలు,
                        అడిగితే ఇచ్చేవారు మానవులు,
                        అడిగిన యివ్వనివారు రాక్షసులు.
                        ఏ జాతి వారు మీరు? ఆలోచించండి.


 




                
 



Related Posts Plugin for WordPress, Blogger...